మామూలు పెట్రోల్.. ప్రీమియం పెట్రోల్.. ఏది బెటర్!
దాదాపుగా పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ప్రతిసారీ కనిపించే దృశ్యం ఇది. కొందరు సాధారణ పెట్రోల్ తీసుకుంటే మరికొందరు మాత్రం పవర్, ప్రీమియం, ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ కావాలంటుంటారు. ముఖ్యంగా ఖరీదైన బైకులు, కార్లు నడిపేవారు ఈ తరహా ఇంధనాన్ని కొంటుంటారు. సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం ఇంధనాల ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కొనుగోలు చేసే వారు తక్కువగా ఉంటారు. అయితే, రెండింటికీ మధ్య తేడా ఏంటనేది చాలా మందికి తెలియదు. దీంతో, పవర్, ప్రీమియం ఇంధనాలు కొనాలనుకున్నా వాటి వల్ల ఉపయోగం ఎంతో తెలియక ఆ ఆలోచనను పక్కన పడేస్తారు. మరి సాధారణ ప్రయాణికులకు ప్రీమియం పెట్రోల్‌తో ఉపయోగం ఉంటుందా? హైపవర్ వాహనాలకే ఇవి పరిమితమా అన్న ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఈ వీడియోలో.. తప్పక చూడండి.