నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ సొంత బ్రాండ్ తో భారత్ లో తొలి స్మార్ట్‌ఫోన్... ధర, ఇతర వివరాలు ఇవిగో!
- ‘హెచ్ఎండీ యారో’ పేరిట విడుదల చేసేందుకు సిద్దమైన హెచ్ఎండీ కంపెనీ
- జులై 25న మార్కెట్లోకి వచ్చే అవకాశాలు
- యూరప్ మార్కెట్‌లో ఉన్నట్టుగా భారత్‌లోనూ రేటు రూ.12,460గా ఉండొచ్చని అంచనాలు
- ఆకట్టుకుంటున్న ఫోన్ ఫీచర్లు
ఫీచర్ ఫోన్ల కాలంలో నోకియా బ్రాండ్ హవా కొనసాగింది. అయితే ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ల యుగం రావడంతో ఆ కంపెనీ ఫోన్లు దాదాపు కనుమరుగయ్యాయి. ఆ తర్వాత కాలంలో నోకియా ఫోన్లను తయారుచేసే లైసెన్స్ పొందిన హెచ్ఎండీ (హ్యూమన్ మేడ్ డివైస్) సంస్థ... ఇప్పటిదాకా నోకియా బ్రాండ్ తో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు తీసుకువచ్చింది. ఇప్పుడు హెచ్ఎండీ తన సొంత బ్రాండ్ తో భారతదేశంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమైంది.
భారత మార్కెట్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను ‘హెచ్ఎండీ యారో’ పేరుతో ఇక్కడ పరిచయం చేయనుంది. యూరోపియన్ మార్కెట్లలో ‘హెచ్ఎండీ ప్లస్’ పేరిట ఇప్పటికే విడుదల చేసింది.
‘హెచ్ఎండీ యారో’ స్మార్ట్‌ఫోన్‌ను జులై 25న భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు పేరు ఎంపిక కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోటీని కూడా నిర్వహించింది.
ధర రూ.12,460 ఉండొచ్చు!
యూరోపియన్ మార్కెట్లలో ఈ హెచ్ఎండీ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.12,460గా ఉంది. దీనికి సమానమైన ధరతో భారత మార్కెట్‌లోనూ విడుదల చేసే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. అట్మాస్ బ్లూ, డ్రీమీ పింక్, మెటోర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 6.65-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్, 600 నిట్స్ వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్, 8జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఇంటర్ననల్ స్టోరేజీ, యునీసోక్ చిప్‌సెట్ ఈ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లుగా ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక 10వాట్స్ USB టైప్- సీ ఛార్జింగ్ సపోర్ట్,తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కు కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.