టీ20ల్లో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. వీడియో ఇదిగో!

  • 1 బాల్ కు 13 రన్స్ రాబట్టిన యశస్వి
  • నో బాల్ కావడంతో వరుసగా రెండు సిక్సర్లు బాదిన వైనం
  • జింబాంబ్వేతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో యశస్వి రికార్డు
జింబాంబ్వే పర్యటనలో భారత కుర్రాళ్ల జట్టు అదిరే ప్రదర్శన చేసింది.. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ20ల్లో ఒకే బంతికి 13 పరుగులు రాబట్టిన తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డులకు ఎక్కాడు. జింబాంబ్వే బౌలర్ సికందర్ రాజా బౌలింగ్ లో నో బాల్, ఫ్రీ హిట్ బంతులను సిక్సర్లుగా మలచడంతో ఈ రికార్డు సాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సికందర్ రాజా వేసిన ఫుల్ టాస్ ను డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా జైస్వాల్ స్టాండ్స్ లోకి పంపించాడు. సిక్సర్ గా సిగ్నల్ ఇస్తూనే అంపైర్ ఈ డెలివరీని నో బాల్ గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ రూపంలో జైస్వాల్ కు మరో అవకాశం వచ్చింది. దీంతో జైస్వాల్ మరోసారి బంతిని సిక్సర్ గా మలిచాడు. దీంతో రెండు సిక్సర్లకు 12 పరుగులు, నో బాల్ కు ఒక పరుగు.. మొత్తం 13 పరుగులు భారత జట్టు స్కోరు బోర్డుకు యాడ్ అయ్యాయి. టీ 20 మ్యాచ్ లలో ఈ ఘనతను ఇప్పటి వరకూ ఏ బ్యాట్స్ మెన్ కూడా సాధించలేదు.


More Telugu News