నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు?: జ్యోతిరెడ్డి

  • 2018 నుంచి తాను జియో వాడుతున్నానన్న జ్యోతిరెడ్డి
  • క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని వ్యాఖ్య
  • మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదని ప్రశ్న
నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు?: జ్యోతిరెడ్డి
భారత శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు. అనంత్ వివాహ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు కూడా హాజరయ్యారు. 

అయితే తనను పెళ్లికి పిలవలేదని బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి తాను జియో వాడుతున్నానని... క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని చెప్పారు. తాను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడుతున్నవారంతా అంబానీ చుట్టాలు కాదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోని గొప్ప వాళ్లందరినీ పెళ్లికి పిలిచారని... ఇన్నేళ్లుగా జియో వాడుతూ, మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు. జియో ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు.


More Telugu News