నెల్లూరులో రొట్టెల పండుగ... రాష్ట్రాభివృద్ధి రొట్టె పట్టుకున్న మంత్రి నారాయణ
నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ అత్యంత ఘనంగా సాగుతోంది. తొలిరోజే లక్ష మంది వరకు వచ్చినట్టు అంచనా. నిన్న, ఇవాళ కూడా భక్తులు పోటెత్తారు. ఏపీ మంత్రి పొంగూరు నారాయణ కూడా రొట్టెల పండుగలో పాలుపంచుకున్నారు.
ఇవాళ ఆయన నెల్లూరు బారా షహీద్ దర్గా వద్దకు విచ్చేశారు. అక్కడ రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలోనే బారా షహీద్ దర్గా అభివృద్ధి జరిగిందని వెల్లడించారు.
దర్గా ఆవరణలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు రొట్టెల పండుగ నిర్వహణ కోసం రూ.5 కోట్లు ఇచ్చారని వివరించారు. వైసీపీ హయాంలో నెల్లూరు దర్గాను పట్టించుకోలేదని మంత్రి నారాయణ ఆరోపించారు.