ఒలింపిక్స్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు

  • ఒలింపిక్స్ లో ఇండియా తరపున పాల్గొన్న 117 మంది ఆటగాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి
  • పతకాలు సాధించిన వారికి చిరు ప్రశంసలు
  • నిజమైన పోరాట యోధురాలు వినేశ్ ఫోగాట్ అంటూ కొనియాడిన చిరంజీవి
ఒలింపిక్స్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు
ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. అలాగే ఇండియా తరపున పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పతకాలు సాధించిన వారిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు.
 
షూటింగ్ స్టార్స్ మనూభాకర్, సరబ్ జీత్ సింగ్, స్వప్నిల్ కుశాలే, ఇండియా హాకీ టీమ్, హాకీ క్రీడాకారుడు శ్రీజేశ్, జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ లను అభినందించారు. వినేశ్ ఫోగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివంటూ చిరంజీవి కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  ఈ ఏడాది ఒలింపిక్స్ చూసేందుకు చిరంజీవి తన కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే.  పారిస్ వీధుల్లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి, కోడలు ఉపాసన ఎక్స్ లో పంచుకున్నారు.
 


More Telugu News