వారి వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు
- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత
- ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్న సుప్రీంకోర్టు
- సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులుగా దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ ఉన్నాయి.
కవిత మధ్యంతర బెయిల్ అంశానికి సంబంధించి సీబీఐ, ఈడీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. ఈ నెల 20న విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం తెలిపింది.