తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

  • విభజన సమయంలో ఏపీకి ఉద్యోగుల కేటాయింపు
  • వారిని సొంత రాష్ట్రానికి పంపిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం
  • తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు రిలీవ్ ఆర్డర్స్
తెలంగాణ స్థానికతతో ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో ఏపీకి కేటాయించిన వారిని, వారి సొంత రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఆ మేరకు  తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు వారి స్వరాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ సర్కారు ఈ రిలీవ్ ఆర్డర్స్ జారీ చేసింది.


More Telugu News