'ఎట్ హోమ్' లో కూటమి నేతల కోలాహలం... ఫొటోలు ఇవిగో!
- విజయవాడలోని రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం
- ఆతిథ్యమిచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు
విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు రాజ్ భవన్ ఆతిథ్యమిచ్చిన 'ఎట్ హోమ్' కార్యక్రమంలో సందడి చేశారు.
గవర్నర్ ఇచ్చిన ఈ తేనీటి విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.