'కల్కి 2898 ఏడీ' రికార్డు బ్రేక్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా 'స్త్రీ 2'
- శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో ‘స్త్రీ 2’
- ఫస్ట్ డేనే మూవీకి రూ.54.35 కోట్ల వసూళ్లు
- ఫైటర్, కల్కి 2898 ఏడీ ఓపెనింగ్ డే వసూళ్లను డబుల్ మార్జిన్‌తో క్రాస్ చేసిన ‘స్త్రీ 2’
- అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. ఇండిపెండెన్స్ డే సందర్భంగా గురువారం ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ. 54.35 కోట్లు కొల్లగొట్టింది. నిన్న మూవీకి రూ. 46కోట్ల కలెక్షన్లు రాగా, బుధవారం ప్రివ్యూస్ రూపంలో రూ. 8.35 కోట్లు వచ్చాయి. ఇలా మొత్తంగా తొలిరోజునే రూ.54.35 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ పేర్కొంది. దీంతో ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
ఈ క్రమంలో ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డే వసూళ్లను డబుల్ మార్జిన్‌తో క్రాస్ చేసింది 'స్త్రీ2'. ఈ రెండు చిత్రాలు తొలిరోజు వరుసగా రూ.22-24 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ఈ ఫిగర్‌ను 'స్త్రీ 2' ఓవర్‌టేక్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. బాలీవుడ్‌లో 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా.. ఆల్ టాప్ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో ‘స్త్రీ 2’ స్థానం సంపాదించడం విశేషం.
గురువారం రూ. 46 కోట్ల కలెక్షన్లతో ‘స్త్రీ 2’... 'బాహుబలి 2' హిందీ (రూ. 41 కోట్లు), 'భారత్' (రూ. 42.3 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (42.62 కోట్లు), 'టైగర్ 3' (రూ. 43 కోట్లు) వంటి చిత్రాలను బీట్ చేసింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద 7వ ఆల్ టైమ్ బాలీవుడ్ ఓపెనర్‌గా అవతరించింది.
ఇక పెయిడ్ ప్రివ్యూలను కలిపి తొలిరోజు మొత్తం రూ. 54.35 కోట్లుగా తీసుకుంటే, ‘స్త్రీ 2’ ఆల్ టైమ్ టాప్ 4 బాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. 'యానిమల్' (రూ. 54.75 కోట్లు), 'పఠాన్' (రూ. 55 కోట్లు), 'జవాన్' (రూ. 65.5 కోట్లు). అటు హీరోహీరోయిన్ రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్‌లకు కూడా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈ మూవీ నిలవడం విశేషం.
కాగా, నిన్న విడుదలైన మరో రెండు హిందీ చిత్రాలు అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే', జాన్ అబ్రహం 'వేద'. ఈ రెండు సినిమాలు ‘స్త్రీ 2’ దెబ్బకు కుదేలయ్యాయి. ఈ మూవీ మొదటి వారాంతంలోనే బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల నెట్ మార్క్‌ను అధిగమించవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫస్ట్ లుక్, ట్రైలర్ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.