రేపు భారత్ లో కనువిందు చేయనున్న 'సూపర్ మూన్'
- ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్
- భారత్ లో ఆగస్టు 19న దర్శనమివ్వనున్న సూపర్ మూన్
- వివరాలు వెల్లడించిన నాసా
భారత్ లో రేపు సోమవారం నాడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.
ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని పేర్కొంది. అయితే, మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది.
ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా... భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది.
కాగా, సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే, సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడు.