ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఆర్డర్‌లోని కీలక అంశాలు ఏంటంటే...!
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్
- బెయిల్ పిటిషన్‌పై గంటన్నర పాటు సాగిన వాదనలు
- ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్
- పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలన్న కోర్టు
- కేసు ట్రయల్‌కు సహకరించాలని స్పష్టీకరణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై దాదాపు గంటన్నర పాటు వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది.
అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. దీంతో దాదాపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బయటకు రానున్నారు. ఇక కవితకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కవిత బెయిల్ ఆర్డర్‌లోని కీలక అంశాలివే..!
* పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి
* కేసు ట్రయల్‌కు సహకరించాలి
* విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి
* విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి