టార్గెట్ సజ్జల.. వైసీపీని వణికిస్తున్న హీరోయిన్ జెత్వానీ ఏపీకి వస్తోంది
- కాసేపట్లో హైదరాబాద్ కు వస్తున్న జెత్వానీ
- ఆమెను విజయవాడకు తీసుకెళ్లనున్న ఏపీ పోలీసులు
- చిక్కుల్లో కొందరు ఐపీఎస్ లు
కాదంబరి జెత్వానీ... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. ముంబై హీరోయిన్ అయిన కాదంబరి జెత్వానీ... ఇప్పుడు వైసీపీనీ షేక్ చేస్తోంది. ఆమెను, ఆమె కుటుంబాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొందరు సీనియర్ ఐపీఎస్ లు టార్చర్ పెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్ తో ఆమె మాట్లాడతూ కీలక విషయాలను బయటపెట్టారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలని విజయవాడ పోలీసులు డిసైడ్ అయ్యారు.
కాసేపట్లో జెత్వానీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఆమెను విజయవాడకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏపీ డీజీపీ కేసు వివరాలపై ఆరా తీశారని తెలిపారు. ఈ కేసు విచారణ అధికారిణిగా స్రవంతి రాయ్ ని నియమించామని చెప్పారు. సినీ నటిపై చీటింగ్ కేసు పెట్టి... మొత్తం కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేశారో ఆరా తీస్తామని అన్నారు. నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పారు. డీజీపీకి పూర్తి నివేదిక అందిస్తామని తెలిపారు. ఐపీఎస్ ల పాత్ర ఉంటే వారిపై చర్యలు కచ్చితంగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు.