వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్... ఎలా ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదని వెల్లడి
- నేడు పార్టీ సీనియర్ నేతలతో జగన్ సమావేశం
- విజయవాడ వరదలపై చర్చ
- వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న జగన్
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు.
అయితే, ఆ సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నిన్న విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయని, కానీ నిందను తమపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.