మద్దతివ్వడానికి కాదు.. ఫొటో కోసమే వచ్చారు: పీటీ ఉషపై వినేశ్ ఫొగాట్ ఫైర్
- భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిపై ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
- పారిస్ లో చాలా రాజకీయాలు జరిగాయని ఆరోపణ
- అన్నిచోట్లా రాజకీయాలు చేస్తుంటే ఎలా ఆడాలంటూ ఆవేదన
పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడినపుడు తనకు ఎలాంటి మద్దతు దొరికిందో చెప్పలేనని స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ లీడర్ వినేశ్ ఫొగాట్ చెప్పారు. అక్కడ చాలా రాజకీయాలు జరిగాయని చెప్పారు. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తనను పరామర్శించిందని నెట్ లో వైరల్ గా మారిన ఫొటోపై ఆమె తాజాగా స్పందించారు. అప్పుడు జరిగిందంతా ఓ నాటకమని, పీటీ ఉష కేవలం ఫొటోలు దిగడానికే వచ్చారని ఆరోపించారు. తనకు తెలియకుండానే ఫొటో తీసి, నెట్ లో ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. అనర్హత వేటు పడినప్పుడు తాము కూడా మద్దతుగా ఉన్నామని చెప్పుకోవడానికే పీటీ ఉష తన దగ్గరికి వచ్చారని విమర్శించారు.
జులానా నుంచి అసెంబ్లీ బరిలోకి..
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగాట్ కు ఆ పార్టీ హర్యానా అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. జులానా నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపింది. అయితే, ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై భిన్నాభిప్రాయాలు వెలవడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫొగాట్ సంచలన ఆరోపణలు చేశారు. పీటీ ఉష తనను కలిసేందుకు ఆ రోజు ఆసుపత్రికి వచ్చిన మాట నిజమేనని, ఆ ఫొటో కూడా నిజమేనని తెలిపారు. అయితే, ఆమె కేవలం ఆ ఫొటో కోసమే వచ్చారని, తనకు తెలియకుండా ఫొటో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పారిస్ లో జరిగిన రాజకీయాలు చూసి తన గుండె పగిలిపోయిందన్నారు. ఓవైపు అంతటా రాజకీయాలు జరుగుతుంటే తాను ఆటలపై ఎలా దృష్టి కేంద్రీకరించగలనని వినేశ్ ఫొగాట్ నిలదీశారు.