మత్తువదలారా2 సినిమా చూసి స్పందించిన హీరో మహేశ్ బాబు.. ఏమన్నారంటే?
ఇటీవలే థియేటర్లలో విడుదలైన మత్తువదలరా-2 ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ జాబితాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కూడా చేరిపోయాడు. శనివారం రాత్రి ఆసక్తికర ట్వీట్ చేశాడు.
మత్తువదలారా2 సినిమా ఒక నవ్వుల అల్లరి అని ప్రిన్స్ చెప్పాడు. సినిమా మొత్తం ఎంజాయ్ చేశానని, సింహ కోడూరితో పాటు తారాగణం అంతా అద్భుతంగా పనిచేశారని మెచ్చుకున్నాడు. ‘‘వెన్నెల కిశోర్.. నువ్వు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య.. నువ్వు తెరమీద కనిపించినప్పుడు మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. అద్భుతంగా నటించారు. మంచి సమయం గడిపాను. టీమ్ మొత్తానికి అభినందనలు’’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన స్మైలీ, హార్ట్ ఎమోజీలను కూడా జోడించారు. ప్రధాన నటులు, మైత్రి మూవీస్ ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు.
కాగా శ్రీసింహా కథానాయకుడిగా 2019లో వచ్చిన 'మత్తువదలరా' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిశోర్, సత్య, ఫరియా అబ్దుల్లా, అజయ్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రితేశ్ రాణా దర్శకత్వం వహించగా పెదమల్లు చిరంజీవి-హేమలత నిర్మాతలుగా ఉన్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.