ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మాజీ ఐజీ రామకృష్ణపై వేటుకు రంగం సిద్దం!
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీ రామకృష్ణ హయాంలో అవకతవకలు
- ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా నివేదిక
- డిప్యుటేషన్ పదవీ కాలం ముగియడంతో తిరిగి కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రామకృష్ణ
ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. నేడో రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామకృష్ణ హయాంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు జరిగాయని, సాఫ్ట్ వేర్ కు సంబంధించి ఓ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి టెండర్లు కట్టబెట్టడం, వైసీపీ నేతలకు లబ్ది కలిగేలా ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఉత్తర్వులు ఇవ్వడం వంటి అభియోగాలు ఉన్నాయి.
ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఆ శాఖలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. కేంద్రం నుండి డిప్యుటేషన్‌పై వచ్చిన రామకృష్ణ పదవీ కాలం ముగియడంతో మళ్లీ వెనక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.