స్వల్ప లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు
- 83,000కు పైన ముగిసిన సెన్సెక్స్
- 25,400 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ
- నష్టాల్లో ముగిసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు
భారత స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు ఎగిసి 83,079 వద్ద ముగియగా... నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 25,418 వద్ద స్థిరపడింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 సూచీ 72 పాయింట్లు నష్టపోయాయి.
సెన్సెక్స్-30 స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టాప్ గెయినర్లుగా నిలువగా... టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్లుగా నిలిచాయి.
రంగాలవారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, మెటల్, మీడియా రంగాలు భారీగా నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫిన్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఎనర్జీ రంగాలు లాభాల్లో ముగిశాయి. 2,241 షేర్లు నష్టాల్లో... 1,709 షేర్లు లాభాల్లో ముగియగా, 108 షేర్లలో ఎలాంటి మార్పులేదు.