పంత్‌, గిల్ హాఫ్ సెంచ‌రీలు.. లంచ్ స‌మ‌యానికి 400 దాటిన భార‌త్‌ ఆధిక్యం

  • చెన్నై వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ తొలి టెస్టు
  • మూడోరోజు భోజ‌న విరామానికి భార‌త్ స్కోర్ 205/3
  • ఇప్ప‌టికే టీమిండియా ఆధిక్యం 432 రన్స్‌  
చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 81/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా భోజ‌న విరామానికి మ‌రో వికెట్ న‌ష్ట‌పోకుండా 205 ప‌రుగులు చేసింది. రిష‌భ్ పంత్ (82 నాటౌట్‌), శుభ్‌మ‌న్ గిల్ (86 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీలతో క‌దంతొక్కారు. ఈ ద్వ‌యం ఇప్ప‌టికే సెంచ‌రీ (138) భాగ‌స్వామ్యం అందించింది.  

ఇప్ప‌టికే తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన‌కు 227 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగులు క‌లిపి మొత్తం ఆధిక్యం 432 రన్స్‌కు చేరింది. బంగ్లా బౌల‌ర్ల‌లో త‌స్కిట్ అహ్మ‌ద్‌, మెహ‌దీ హ‌స‌న్ మిర్జా, న‌హీద్ రాణా చెరో వికెట్ తీశారు. ఇక బంగ్లాదేశ్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 149 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.


More Telugu News