చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
- సోమవారం అర్థరాత్రి ఆపోలో ఆసుపత్రిలో రజనీ చేరిక
- నేడు ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలు
- ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడని వైనం
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలను షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం.
కాగా, ఆయన ఆసుపత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక 73 ఏళ్ల రజనీ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న 'వేట్టైయాన్' అక్టోబర్ 10 న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇక దశాబ్దం క్రితం సూపర్ స్టార్ సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య కారణాలతోనే రాజకీయాలకు కూడా దూరమయ్యారు. రాజకీయ అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న రజనీకాంత్ చివరి నిమిషంలో వైద్యుల సలహా మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే.