బాబర్ ఆజం వారసుడు అతడేనా..?
- తాజాగా పాక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్
- అతని స్థానంలో కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌కు అవకాశమంటూ వార్తలు
- హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, పీసీబీ పెద్దల మద్దతు అతనికేనన్న పాక్ మీడియా
పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా బాబర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించాడు. అయితే, అతని స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యే అవకాశం ఉందని జియో న్యూస్ తెలిపింది.
జియో న్యూస్ కథనం ప్రకారం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెద్దలు టీమ్ సెలెక్షన్ కోసం ఇప్పటికే రిజ్వాన్‌తో సమావేశం అయ్యారట. అటు బాబర్‌ను కెప్టెన్సీకి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెడ్ కోచ్ కిర్ స్టెన్ కూడా బాబర్ ను కెప్టెన్ గా కొనసాగాలని కోరాడట. కెప్టెన్సీని వదులుకోవాలనే నిర్ణయం పూర్తిగా బాబర్ దే.
తన ఆటపై మరింత దృష్టి పెట్టాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాబర్ తెలిపాడు. ఈ మేరకు అతడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా, 2019లో బాబర్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ, అతని కెప్టెన్సీలో పాక్ జట్టు ఏ పెద్ద టోర్నీలలోనూ గెలవలేదు. గతేడాది అతని నాయకత్వంలోనే ఆసియా కప్‌లో సూపర్ 4 దశలోనే నిష్క్రమించింది.
అనంతరం కొన్ని నెలల తర్వాత భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టు నాకౌట్ దశను దాటలేకపోయింది. దీంతో ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత బాబర్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దాంతో పీసీబీ.. షాహీన్ షా అఫ్రిదీకి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ, అతడు కెప్టెన్‌గా విఫలం అయ్యాడు. దాంతో కేవలం ఒక సిరీస్ తర్వాత షహీన్ ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. అఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ 4-1 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
బాబర్ ఆజం అంతర్జాతీయ కెరీర్ ఇలా..
బాబర్ 2016లో వెస్టిండీస్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 54.63 స్ట్రైక్ రేట్‌తో 3,962 పరుగులు చేశాడు.
అలాగే 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇందులో 117 మ్యాచ్‌లు ఆడి, 88.75 స్ట్రైక్ రేట్‌తో 5,729 పరుగులు చేశాడు.
ఇక 2016లో ఇంగ్లండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బాబర్ 123 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 129.08 స్ట్రైక్ రేట్‌తో 4,145 పరుగులు చేశాడు.