ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్‌గా కొన‌క‌ళ్ల నారాయ‌ణ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

  • ఇటీవ‌ల ఏపీలో మొత్తం 20 కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్ల నియామ‌కం
  • ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్‌గా కొన‌క‌ళ్ల నారాయ‌ణ
  • ఈరోజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొన‌క‌ళ్లకు మంత్రులు, టీడీపీ నేతల అభినంద‌న‌లు
ఇటీవ‌ల ఏపీలో ప‌లు నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. మొత్తం 20 కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్ల‌ను నియ‌మించింది. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్‌గా కొన‌క‌ళ్ల నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. దాంతో ఇవాళ ఆయ‌న ఆర్‌టీసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీరించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, కొల్లు ర‌వీంద్రతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు కొన‌క‌ళ్ల‌ను స‌త్క‌రించి అభినంద‌న‌లు తెలిపారు. 

కొన‌క‌ళ్ల గ‌తంలో రెండుసార్లు మ‌చిలీప‌ట్నం ఎంపీగా ప‌నిచేశారు. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు కార‌ణంగా టీడీపీ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు. జ‌న‌సేన అభ్య‌ర్థికి ఇక్క‌డి ఎంపీ సీటు ద‌క్కింది. దాంతో అధిష్ఠానం ఆయ‌న‌ను తాజాగా ఆర్‌టీసీ ఛైర్మ‌న్‌గా నియ‌మించింది. 

ఇక మొత్తం 20 కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్ల‌ను నియ‌మించిన కూట‌మి ప్ర‌భుత్వం ఒక కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను ప్రకటించింది. ఇందులో జ‌నసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక‌రికి, టీడీపీ నుంచి 16 మందికి అవ‌కాశం ద‌క్కింది.


More Telugu News