పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ముద్రగడ కుమార్తె క్రాంతి
- నేడు జనసేన పార్టీలో భారీగా చేరికలు
- ముద్రగడ క్రాంతికి, ఆమె భర్తకు జనసేన కండువా కప్పిన పవన్
- జనసేనలో చేరిన పలువురు గుంటూరు కార్పొరేటర్లు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నేడు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. క్రాంతి భర్త కూడా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
వీరే కాకుండా... గుంటూరు కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కొందరు జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. పెడన నియోజకవర్గం నుంచి ఓ ఎంపీటీసీ, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచిలు కూడా పార్టీలోకి వచ్చారు. వీరందరికీ పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీలోకి చేరికలు తమపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయని అన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల్లో అభివృద్ధికి ఊతమిస్తోందని, మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ సమర్థంగా పనిచేస్తోందని అన్నారు.
ఇటీవల ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి బాహాటంగా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు.
అటు, పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానన్న ముద్రగడ... ఎన్నికల్లో పవన్ గెలవడంతో నిజంగానే తన పేరు మార్చుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు గెజిట్ కూడా విడుదల చేశారు.