పుణే టెస్టులో టీమిండియా స్పిన్నర్ల హవా... కష్టాల్లో కివీస్
- పుణేలో నేటి నుంచి భారత్, కివీస్ రెండో టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- 204 పరుగులకే 6 వికెట్లు డౌన్
- చెరో 3 వికెట్లు తీసిన అశ్విన్, వాషింగ్టన్ సుందర్
బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో పేస్ పిచ్ పై ఓటమిపాలైన టీమిండియా... ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్ పిచ్ పై విజృంభిస్తోంది. ఇవాళ పుణేలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది.
టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. 204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ 3, సుందర్ 3 వికెట్లతో కివీస్ ను దెబ్బకొట్టారు.
న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ డెవాన్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశారు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 18, డారిల్ మిచెల్ 18, టామ్ బ్లండెల్ 4 పరుగులు చేశారు.
ప్రస్తుతం కివీస్ స్కోరు 68 ఓవర్లలో 6 వికెట్లకు 227 పరుగులు. గ్లెన్ ఫిలిప్స్ 4, మిచెల్ శాంట్నర్ 19 పరుగులతో ఆడుతున్నారు.