రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కేటీఆర్
- మూసీ పేరుతో దోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ
- మూసీ పునరుజ్జీవ పనులను కేసీఆర్ ఎప్పుడో ప్రారంభించారన్న కేటీఆర్
- మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన నాచారంలోని ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నిర్మించిన ఎస్టీపీల వల్ల మురుగు నీటి శుద్ధి జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధికి రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తమ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.
కేసీఆర్ మూసీ పునరుజ్జీవ పనులు ఎప్పుడో ప్రారంభించారని, ఇప్పుడు కొత్తగా వచ్చి చేయాల్సిందేమీ లేదని విమర్శించారు. ఏ పథకం, అభివృద్ధి పనికి డబ్బులు లేవని మంత్రులు చెబుతున్నారని, మరి మూసీ పునరుజ్జీవానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ఎవరి కోసమని ప్రశ్నించారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని... ఆ పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.