స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. బొమ్మల్లా కొట్టుకుపోయిన వందలాది కార్లు.. వీడియో ఇదిగో!
- పలువురి మృతి.. వందలాదిమంది గల్లంతు
- దక్షిణ స్పెయిన్‌లోనూ వరద బీభత్సం
- గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు
స్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. గల్లంతయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.
వాలెన్సియాలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో స్కూళ్లు మూసివేశారు. క్రీడా కార్యక్రమాలను నిలిపివేశారు. 12 విమానాలను దారి మళ్లించగా, 10 విమానాలను రద్దు చేశారు. అండలూసియాలో 276 మంది ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.