అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్.. 20 వేల మందికి ఉపాధి
- ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్-నిప్పన్ స్టీల్స్
- రెండు దశల్లో పెట్టుబడులు
- తొలి దశలో ఏకంగా రూ. 70 వేల కోట్ల పెట్టుబడి
- ఫ్యాక్టరీ నిర్మాణంలో 25 వేల మందికి, నిర్వహణ కోసం 20 వేల మందికి ఉపాధి
- జనవరి 2029 నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో మరో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ అయిన అర్సెలార్ మిట్టల్-జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ కంపెనీ కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పీ) ఏర్పాటు చేయనున్నాయి. రెండు దశల్లో పెట్టుబడులు పెట్టనుండగా, తొలి దశలో ఏకంగా రూ. 70 వేల కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్నాయి. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి.
జనవరి 2029 నాటికి తొలి దశ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారు. ప్లాంట్ నిర్మాణంలో 25 వేల మందికి, నిర్వహణ కోసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.