ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

  • 7,500 కేజీల లోపున్న రవాణా వాహనాలను ఎల్ఎంవీ లైసెన్స్ హోల్డర్లు నడపొచ్చన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం
  • వారు వాహనాలు నడపడానికి, రోడ్డు ప్రమాదాలకు సంబంధం లేదన్న ధర్మాసనం
  • మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న నియమాలు దీనికి వర్తించవని స్పష్టీకరణ
ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఎల్ఎంవీ కేటగిరీలోని ట్రాన్స్‌పోర్టు వాహనాలను డ్రైవ్ చేసేందుకు వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఆమోదం అవసరం లేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 7,500 కేజీల లోపు బరువున్న వాహనాలను ఎల్ఎంవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లు నడపవచ్చని పేర్కొంది. 

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడం కారణమని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలు, దాని కింద రూపొందించిన నియమాలు మధ్యస్థ/భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.  


More Telugu News