ఖండాంతరాలు దాటిన ప్రేమ... పెళ్లి బంధంతో ఒక్కటి
- కెనడా అమ్మాయితో అమలపురం అబ్బాయి పెళ్లి
- 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన మనోజ్ కుమార్
- అక్కడే బ్యాంకు ఉద్యోగం సంపాదించి స్థిరపడిన వైనం
- ఈ క్రమంలో కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్‌తో ప్రేమాయణం
- ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి
ఖండాంతరాలు దాటిన ప్రేమ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఏపీలోని అమలాపురంకు చెందిన తెలుగు అబ్బాయి, కెనడా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం ఏపీలోని అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడా వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే ఓ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం కెనడాలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో మనోజ్ కుమార్‌కు కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. దాంతో గత ఏడేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి కెన్యాలో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ఇటు హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చింది. తాజాగా వీరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో హిందూ సాంప్రదాయం ప్రకారం తాము పెళ్లి చేసుకుని, ఆపై రిసెప్షన్ నిర్వహిస్తామని మనోజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.