కడప జిల్లా ఎస్పీపై బదిలీ వేటు
- పవన్, లోకేశ్, అనితలపై వర్రా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు
- రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం
- కడప జిల్లాలో సీఐ సస్పెన్షన్
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సోషల్ మీడియాలో వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి ఆయనను వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హర్షవర్ధన్ బదిలీపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కడప జిల్లాలో మరో సీఐను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలపై రవీంద్రారెడ్డి గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.