ఐపీఎల్ వేలంలో అండర్సన్.. అంత ధరకు అతడినెవరు కొంటారన్న ఆకాశ్ చోప్రా
- చివరిసారి 2014లో టీ20 ఆడిన అండర్సన్
- ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై
- టీ20 మ్యాచ్ ఆడి పదేళ్లు అయిన అతడు వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోతాడన్న ఆకాశ్ చోప్రా
ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ ఐపీఎల్ మెగా వేలంలో రూ. 1.25 కోట్ల కనీస ధర క్యాటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. 42 ఏళ్ల అండర్సన్ చివరిసారి 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు.
వేలంలో అండర్సన్ తన పేరు నమోదు చేసుకోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. అండర్సన్ తన పేరును ఎందుకు నమోదు చేసుకున్నాడో తెలియదని, అతడిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అతడు టీ20 మ్యాచ్ ఆడి దాదాపు పదేళ్లు అవుతుందని, దీనికితోడు రూ.1.25 కోట్లకు తన పేరును నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. ఈ వేలంలో అతడిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చన్న చోప్రా.. అండర్సన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.