హైదరాబాదులో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్.. సెట్స్ వద్ద భారీ భద్రత

  • సికిందర్ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్
  • హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మూవీ చిత్రీకరణ
  • సల్మాన్ భద్రత నేపథ్యంలో హోటల్‌ను అధీనంలోకి తీసుకున్న పోలీసు అధికారులు
 
హైదరాబాదులో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్.. సెట్స్ వద్ద భారీ భద్రత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'సికిందర్' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.

అయితే ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తరచూ బెదిరింపులు రావడం, కొన్ని రోజుల క్రితం సల్మాన్ సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురి కావడంతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణగా 70 మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్ఎస్‌జీ కమాండోలతో పాటు పోలీస్ సిబ్బంది, వ్యక్తిగత రక్షణ దళం ఉంది. 

ఈ క్రమంలో నాలుగు లేయర్ల భద్రతను సల్మాన్‌కు కల్పించారు. ఇప్పటికే సల్మాన్‌కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది. సల్మాన్ భద్రత నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది హోటల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News