తెలంగాణను అవమానించిన మోదీకి ఊడిగం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

  • కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి
  • సికింద్రాబాద్ ప్రజలు గెలిపిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీత
  • మూసీని బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్న
తెలంగాణను అవమానించిన మోదీకి ఊడిగం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణను అవమానించిన ప్రధాని నరేంద్రమోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే వారిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. గుజరాత్‌లో సబర్మతి సుందరీకరణను సమర్థించిన బీజేపీ నేతలు మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తాము చక్కదిద్దుతున్నామన్నారు. మహిళలకు రూ.1 లక్ష మేర వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వారిని లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యమన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.


More Telugu News