నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం: హరీశ్ రావు
- బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో కానిస్టేబుల్స్ ఎంపికైనట్లు వెల్లడి
- తొమ్మిది నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్నారన్న హరీశ్ రావు
- వారినీ రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటారేమోనని చురక
నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని గోబెల్స్ ప్రచారం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... ఇప్పుడు తొమ్మిది నెలలు శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 8,047 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకుంటాడేమోనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు పరీక్షల్లో ఎంపికై, ఉద్యోగాలు పొంది తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకొని, 8,047 మంది పోలీస్ కానిస్టేబుళ్లు విధుల్లో చేరబోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆ కానిస్టేబుళ్లకు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు.
నీతి, నిజాయతీలతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతలు కాపాడడంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.