కోహ్లీ కూడా సెంచరీ... ఆసీస్ ముందు 534 పరుగుల టార్గెట్

  • పెర్త్ టెస్టులో గెలుపు దిశగా భారత్
  • రెండో ఇన్నింగ్స్ ను 487-6 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన ఆసీస్
  • ఆరంభంలోనే బుమ్రా దెబ్బకు స్వీనీ అవుట్ 
పెర్త్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇవాళ్టి ఆటలో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు. 

అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (161) సూపర్ సెంచరీ సాధించడంతో ఆసీస్ పై టీమిండియా పట్టుబిగించింది. లంచ్ తర్వాత కోహ్లీ కూడా సెంచరీ సాధించడంతో మ్యాచ్ లో తిరుగులేని స్థానంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన తెలుగుతేజం నితీశ్ రెడ్డి రెండో ఇన్నింగ్స్ లో చకచకా 27 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నితీశ్ రెడ్డి 3 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. 

ఇక, 534 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ను బుమ్రా ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ నాథన్ మెక్ స్వీనీని బుమ్రా ఓ అద్భుతమైన బంతితో ఎల్బీడబ్ల్యూ చేశాడు. మెక్ స్వీనీ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు.


More Telugu News