ఐపీఎల్ వేలంలో పంత్ కు రికార్డు ధర... చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే...!
- రిషబ్ పంత్ ను రూ.27 కోట్లతో కొనుగోలు చేసిన లక్నో
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర
- పంత్ నిజంగా స్టార్ ప్లేయర్ అంటూ కోచ్ వ్యాఖ్యలు
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఇవాళ సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైన వేలంలో రిషబ్ పంత్ కు రికార్డు స్థాయిలో రూ.27 కోట్ల ధర పలికింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ క్రికెటర్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే.
కాగా, పంత్ కు రికార్డు ధర పలకడంపై చిన్ననాటి కోచ్ దేవేంద్ర శర్మ స్పందించారు. పంత్ ఈ స్థాయికి ఎదగడం పట్ల గర్విస్తున్నానని తెలిపారు.
"పంత్ నిజంగా స్టార్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు. పంత్ శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై సెంచరీలు కొట్టాడు. గత వారమే, ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లే ముందు నన్ను కలిశాడు. నాతో చాలా సమయం గడిపాడు. ఇద్దరం ఐపీఎల్ గురించి, ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుకున్నాం.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ను టీమిండియా గెలవడంలో పంత్ కీలకపాత్ర పోషిస్తాడని అనుకుంటున్నా. చివరిసారిగా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ లోనూ పంత్ రాణించాడు. ఐపీఎల్ లోనూ రాణించాడు. ఇప్పుడు అతడ్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. పంత్ మాత్రమే కాదు... నా శిక్షణలో మరో ఇద్దరు కూడా ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. వారిలో ఆయుష్ బదోనీ కూడా ఉన్నాడు" అని దేవేంద్ర శర్మ వివరించారు.