ఆర్సీబీని వీడుతూ మహ్మద్ సిరాజ్ భావోద్వేగం.. వైరల్ అవుతున్న హైదరాబాదీ బౌలర్ నోట్!
- ఏడేళ్లు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సిరాజ్
- ఈసారి వేలంలో సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు దక్కించుకున్న గుజరాత్
- ఆర్సీబీతో బంధానికి తెరపడడంతో ఇన్‌స్టా వేదికగా సిరాజ్ భావోద్వేగపూరిత నోట్
- 2018లో బెంగళూరు తరఫున ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బౌలర్
- 87 మ్యాచులు ఆడి.. 83 వికెట్లు తీసిన సిరాజ్
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విడిచిపెట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆర్సీబీతో ఉన్న ఏడేళ్ల బంధానికి తెర పడింది. రూ.2కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్లో సిరాజ్ కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నాడు.
ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున సిరాజ్ మొత్తం 87 మ్యాచులు ఆడాడు. 83 వికెట్లు తీశాడు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఫాస్ట్ బౌలర్.. 2018లో బెంగళూరు తరఫున ఆడాడు. గత సీజన్లో 14 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఏడేళ్ల తర్వాత కొత్త జట్టుకు ఆడనుండడంతో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్సీబీ అభిమానులు, ఫ్రాంచైజీని ఉద్దేశిస్తూ ఇన్‌స్టా వేదికగా ఒక నోట్ విడుదల చేశాడు. ప్రస్తుతం సిరాజ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిరాజ్ నోట్లో ఏముందంటే..
ఆర్సీబీతో ఏడేళ్ల బంధానికి తెర పడడం బాధగా ఉంది. ఏడేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదంటూ హిందీలో ఈ నోట్‌ను సిరాజ్ ప్రారంభించాడు. "ఆర్సీబీ జెర్సీలో ఉన్న ఈ సమయాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నా హృదయం ప్రేమ, కృతజ్ఞత భావోద్వేగంతో నిండిపోతుంది.
నేను మొదటిసారి ఆర్సీబీ జెర్సీని ధరించిన రోజు, మనం ఇంతటి బంధాన్ని ఏర్పరుచుకుంటామని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆర్సీబీ తరఫున వేసిన మొదటి బంతి నుంచి, తీసిన ప్రతి వికెట్, ఆడిన ప్రతి మ్యాచ్, మీతో పంచుకున్న ప్రతి క్షణం, ప్రయాణం ఎంతో ప్రత్యేకం. హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ అన్నింటిలోనూ ఒక విషయం స్థిరంగా ఉంది. అదే.. మీ తిరుగులేని మద్దతు. ఆర్సీబీ కేవలం ఫ్రాంచైజీ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. నా సొంత ఇల్లులా భావించే కుటుంబం.
మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టాండ్లలోని మీ కేరింతలు, సోషల్ మీడియాలో మీ సందేశాలు, మీ స్థిరమైన నమ్మకం ఇన్నాళ్లు నన్ను ముందుకు నడిపించాయి. ఆర్సీబీకి అభిమానులే ఆత్మ. మీరు ఇచ్చే ప్రేమ, మీరు చూపించే విశ్వాసం సాటిలేనివి. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ మీ కలలు, ఆశల బరువును నేను అనుభవించాను. మీరు నా వెనుక ఉన్నారని నాకు తెలుసు కాబట్టి.. నేను ఇన్నాళ్లు అద్భుతంగా రాణించాను. మీకు ఆనందాన్ని పంచాను.
మేము సరిగ్గా ఆడని సమయంలో మీ కళ్లలో కన్నీళ్లను చూశాను. అదే మేము బాగా ఆడిన సందర్భంలో మీ వేడుకలను చూశాను. ప్రపంచంలో మీలాంటి అభిమానులు ఎక్కడా ఉండరు. మీ ప్రేమ, మీ అంకితభావం, మీ విధేయత నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.
ఇప్పుడు నా కెరీర్లో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టినప్పటికీ, నా హృదయంలో ఆర్సీబీ ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది వీడ్కోలు కాదు.. ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు" అని సిరాజ్ సుదీర్ఘ నోట్‌ను రాసుకొచ్చారు.