ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్
- తాను పెట్టిన ఒక పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నారన్న వర్మ
- ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్
- ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న వర్మ
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్ లో తాను పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని... ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తుండటం చట్ట విరుద్ధమని అన్నారు. ఇకపై కేసులు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని, ఇప్పటి వరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు.
మరోవైపు వర్మ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరగాల్సి ఉంది. అయితే, ఆ పిటిషన్ విచారణకు రాలేదు. ఈరోజు వర్మ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. వర్మ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. విచారణకు హాజరుకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వర్మపై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు.