భక్తులకు, టీటీడీకి క్షమాపణ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకా జైన్

  • అలిపిరి మెట్ల మార్గంలో వీడియోలు చేసిన ప్రియాంక, శివకుమార్
  • చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో
  • తెలియక తప్పు చేశామంటూ మరో వీడియో విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకా జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ క్షమాపణలు చెప్పారు. తిరుమల నడక మార్గంలో సరదా కోసం వీడియో చేశామని... ఆ వీడియోతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తాము భావించలేదని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తెలియక తప్పు చేశామని... తమను అందరూ క్షమించాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వీడియోను విడుదల చేశారు. 

ఇటీవల శివకుమార్ తో కలిసి ప్రియాంక తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో వీరిద్దరూ రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. ఆ తర్వాత చిరుత లేదని, సరదాగా వీడియో చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీని కోరారు. ఈ క్రమంలోనే వీరు క్షమాపణలు చెప్పారు.


More Telugu News