ఆనాడు రేవంత్ రెడ్డిని చిన్న కేసులో అరెస్ట్ చేశారు: కొండా సురేఖ
- బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయాక కార్యకర్తలు గుర్తుకు వస్తున్నారని విమర్శ
- తెలంగాణ కోసం మంత్రి కోమటిరెడ్డి రాజీనామా చేశారన్న కొండా సురేఖ
- కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని సూచన
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయాక కార్యకర్తలు గుర్తుకువస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గంధపు చెక్కల వ్యాపారి అంటూ ఒక బీఆర్ఎస్ నాయకుడు అగౌరవంగా మాట్లాడారని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ వారికి లేదన్నారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు.