కొన్ని గంటలుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనే హరీశ్ రావు
- కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
- సీనియర్ నేతల అరెస్టును ఖండించిన కవిత
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మూడు గంటలకు పైగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. దాంతో, హరీశ్ రావును అరెస్ట్ చేశారని భావిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. హరీశ్ రావును తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి... జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
సీఐని అడ్డగించి, బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హరీశ్ రావును జీపు ఎక్కిస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. హరీశ్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు... రాక్షస పాలన అని మండిపడ్డారు.
"ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలిస్తున్నారు" అంటూ రాసుకొచ్చారు.
అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు... తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
అరెస్టును ఖండించిన కవిత
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని ఆమె డిమాండ్ చేశారు.