ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు రేవంత్ రెడ్డికి యూపీ ప్రభుత్వం ఆహ్వానం

  • ఆహ్వాన పత్రికను అందించిన యూపీ డిప్యూటీ సీఎం
  • జుబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన కేశవ ప్రసాద్ మౌర్య
  • జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అలహాబాద్‌లో మహాకుంభమేళా జరగనుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిదని భక్తులు భావిస్తారు.

ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి... తెలంగాణ సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ మహాకుంభమేళాకు ఆహ్వానించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి పన్నెండేళ్లకోసారి మాఘమాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా జరుపుకుంటారు.


More Telugu News