రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- 2 వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్ఎఫ్ ఏర్పాటు
- విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయం కోసం ప్రత్యేక దళం
- సిబ్బందికి శిక్షణ ఇప్పించిన ప్రభుత్వం
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను (ఎస్‌డీఆర్ఎఫ్) ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ వేడుకలను నిర్వహించింది. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు.
భారీ అగ్నిప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ దళం అత్యవసర సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ స్టేషన్లుగా రూపాంతరం చెందనున్నాయి.
జులై, ఆగస్ట్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్, ఖమ్మం సహా పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) తరహాలో సుశిక్షితులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF)ను ఏర్పాటు చేయడంతో పాటు దీనిని ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు.