లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి అనుమతించిన కోర్టు

  • లగడర్ల దాడి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
  • నరేందర్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్
  • రేపు చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్న పోలీసులు
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల దాడి కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అతనిని రేపు చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలిస్తారు. రెండు రోజుల పాటు అక్కడ ప్రశ్నిస్తారు.


More Telugu News