వెలమ సామాజిక వర్గంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... స్పందించిన కవిత

  • ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాప్రతినిధి స్థాయికి తగవన్న కవిత
  • ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించిన కవిత
  • వ్యక్తిగతమా? పార్టీ వైఖరా? చెప్పాలని రేవంత్ రెడ్డికి నిలదీత
వెలమ సామాజిక వర్గం పట్ల షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఎమ్మెల్యే మాట్లాడారని వెలమ సామాజిక వర్గం ప్రతినిధులు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాజాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ... ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాప్రతినిధి స్థాయికి తగవన్నారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానన్నారు. శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? కాంగ్రెస్ పార్టీ వైఖరే అదా? అనే విషయాలను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News