రైతాంగం తరపున జగన్ కార్యాచరణ ప్రకటించారు: అనంత వెంకట్రామిరెడ్డి
- ఈనెల 13న అనంతపురంలో వైసీపీ ధర్నా
- వైఎస్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్న అనంత వెంకట్రామిరెడ్డి
- జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన
ఈనెల 13న అనంతపురం జిల్లాలో వైసీపీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని... ఖరీఫ్ సీజన్ లో అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు భారీగా నష్టపోయారని చెప్పారు. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో... వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.
రైతాంగం తరపున తమ అధినేత జగన్ కార్యాచరణ ప్రకటించారని తెలిపారు. ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు... అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు... పార్టీ కార్యకర్తలు, రైతులను భాగస్వామ్యం చేసుకుని తరలిరావాలని కోరారు.