రేవంతన్నకి అభినందనలు: ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్
- తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు ఏడాది పూర్తి
- ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని షర్మిల ప్రశంస
- సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా తీర్చిదిద్దే ధ్యేయంతో ముందుకెళుతున్నారని కితాబు
- కాంగ్రెస్‌తోనే రాష్ట్రాల అభివృద్ధి అంటూ ట్వీట్
రేవంతన్నకి అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు ఆమె అభినందనలు తెలిపారు.
"తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం. కాంగ్రెస్‌తోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం. హస్తమే దేశానికి అభయహస్తం" అంటూ రాసుకొచ్చారు.
రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులను షర్మిల తన పోస్టుకు ట్యాగ్ చేశారు.