యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన రేవంత్ రెడ్డి
- వైటీపీఎస్-2లో 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే 5 కేంద్రాలు
- వైటీపీఎస్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద విద్యుత్ ప్లాంట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అనంతరం వైటీపీఎస్ పనులను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణా నదికి సమీపంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు.
కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ను సందర్శించిన శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మెగా టెక్స్ టైల్ పార్కును సందర్శించారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. టెక్స్ టైల్ పార్క్ భూనిర్వాసితులకు డ్రా పద్ధతిలో ఇళ్ల పట్టాలను అందజేస్తారు. 863 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు.