బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం

  • రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు
  • ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం
  • ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ లో ఈ సమావేశం జరిగింది. 

డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరించారు. అసెంబ్లీ, మండలిలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. విద్యారంగంలో ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను ఎండగట్టాలని అన్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు.


More Telugu News