హుస్సేన్ సాగర్ తీరంలో అందరినీ అలరించిన ఎయిర్ షో... హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి
  • విజయోత్సవాల్లో భాగంగా వాయుసేన విమానాలతో విన్యాసాలు
  • హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా నేడు హుస్సేన్ సాగర్ తీరంలో ఎయిర్ షో నిర్వహించారు. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ విమానాలు ట్యాంక్ బండ్ పై గగనతలంలో అద్భుతమైన విన్యాసాలతో అలరించాయి. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో నిర్వహించిన ఈ ఎయిర్ షోలో మొత్తం 9 విమానాలు పాల్గొన్నాయి. ఈ వాయుసేన విన్యాసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.


More Telugu News